మెదక్ జిల్లాలో రేషన్ కార్డులను.. పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డి

మెదక్ జిల్లాలో  రేషన్ కార్డులను.. పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డి

ధన్వాడ, వెలుగు:  అధికారం చేపట్టిన 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్​రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ధన్వాడ, మరికల్  మండలాలకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డ్ ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నామన్నారు. కొత్తగా పెళ్లయిన వాళ్లు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి రేషన్ కార్డులు అందజేశామన్నారు.

 స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​నాయకులను గెలిపించాలని కోరారు. ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొనడం సంతోషకరమన్నారు. జిల్లావ్యాప్తంగా 30 వేల కార్డులను  పంచనున్నట్టు వెల్లడించారు. ధన్వాడకు 580, మరికల్ మండలానికి 82 కార్డులను అందజేశారు. ఇందులో నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, ధన్వాడ సింగల్ విండో చైర్మన్ వెంకట్రామరెడ్డి, మాజీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే పీఏ చిట్టెం మాధవరెడ్డి ,సూర్య మోహన్ రెడ్డి, నరహరి, ప్రత్యేక అధికారి బ్రహ్మనంద రెడ్డి, తహసీల్దార్ సింధుజా రాంకోటీ, ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ సభ్యులు రాగ్యా నాయక్, లక్ష్మీ గౌడ్, వినీతమ్మ పాల్గొన్నారు.