
కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి మొండిచేయి చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోసించారు. రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఖైరతాబాద్ డివిజన్ లో బడా గణేష్ ముందు, చింతల్ బస్తీలో కొత్త మంచి నీటి పైపులైన్లు, డ్రైనేజీ పనులకు దానం శంకుస్థాపన చేశారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని దానం అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావాలని సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే కార్యక్రమంలో ప్రోటో కాల్ పాటించలేదని స్థానిక ఖైరతాబాద్ కార్పొరేటర్ దానం నాగేందర్ తో వాగ్వివాదానికి దిగారు.