ఖేలో ఇండియాతో క్రీడాకారులకు గుర్తింపు : ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

ఖేలో ఇండియాతో క్రీడాకారులకు గుర్తింపు : ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్​ రూరల్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ఖేలో ఇండియా నినాదంతో క్రీడాకారులకు గుర్తింపు లభిస్తోందని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ అన్నారు. నగరంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఉషు లీగ్​పోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ధన్​పాల్​ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చొరవతో గ్రామీణ క్రీడలు వెలుగులోకి వస్తున్నాయని, మహిళా క్రీడాకారులకు ఆదరణ లభిస్తుందని చెప్పారు. 

క్రీడాకారులు పట్టుదలతో ప్రతిభ చూపాలని, తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలని తద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా, సామాజికంగా బలపడుతామని తెలిపారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.