పెన్షన్ ఇవ్వడంలో సర్కార్ నిర్లక్ష్యం : ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

పెన్షన్ ఇవ్వడంలో సర్కార్ నిర్లక్ష్యం : ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
  •     ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ

నిజామాబాద్ రూరల్, వెలుగు : ప్రభుత్వ రిటైర్డ్​ఉద్యోగుల పెన్షన్ అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ ఆరోపించారు. సోమవారం నిజామాబాద్ పట్టణంలో అఖిల భారత పెన్షనర్స్​ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. జీవితకాలం ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తే ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదా అని ప్రశ్నించారు. 

వైద్య ఆరోగ్య సదుపాయాలు, బీమా, టీఏ, డీఏ చెల్లింపుల వంటి అనేక అంశాల్లో రిటైర్డ్​ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకోవడం కాకుండా పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.