నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పరిధిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పరిధిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

నిజామాబాద్​అర్బన్​, వెలుగు:  నిజామాబాద్ అర్బన్​ నియోజకవర్గ పరిధిలోని బాధితులకు ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ సోమవారం సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధ పడే పేదలకు సీఎంఆర్​ఎఫ్​ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  

అర్బన్ నియోజకవర్గంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా అండగా ఉంటానన్నారు.  వంద మందికి రూ.26 లక్షల 49వేల విలువ గల సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను అందజేశారు.