హాస్పిటల్​లో కాన్పు చేసిన ఎమ్మెల్యే.. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సిజేరియన్​చేసిన తెల్లం వెంకట్రావ్

హాస్పిటల్​లో కాన్పు చేసిన ఎమ్మెల్యే.. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సిజేరియన్​చేసిన తెల్లం వెంకట్రావ్
  • డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సిజేరియన్​చేసిన తెల్లం వెంకట్రావ్

భద్రాచలం, వెలుగు: వృత్తి రీత్యా డాక్టర్​అయిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మంగళవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఓ గర్భిణికి సిజేరియన్ చేసి​తల్లీబిడ్డలను కాపాడారు. దుమ్ముగూడెం మండలం డబ్ల్యూ రేగుబల్లికి చెందిన స్వప్న పురిటి నొప్పులతో సోమవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేరారు. 

మంగళవారం నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు డాక్టర్లను సంప్రదించడానికి ప్రయత్నించగా..  గైనకాలజిస్టు అందుబాటులో లేరు. దీంతో వారు ఎమ్మెల్యే వెంకట్రావుకు ఫోన్​ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆయన హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి స్టాఫ్​ కూడా పరిస్థితిని వివరించారు. దీంతో వెంటనే ఆయన స్వప్నను ఆపరేషన్​ థియేటర్​కు తరలించి సిజేరియన్ డెలివరీ​చేశారు. పండంటి మగబిడ్డను చూసి స్వప్న మురిసిపోయింది. ఎమ్మెల్యే వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలిపింది.