మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట : భూక్యా మురళీనాయక్

మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట : భూక్యా మురళీనాయక్
  • ఎమ్మెల్యే డాక్టర్​ భూక్యా మురళీనాయక్  

మహబూబాబాద్​ అర్బన్, వెలుగు : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో మహబూబాబాద్ మండలం సికింద్రాబాద్ గ్రామానికి చెందిన గుగులోత్ మాలి మంజూరైన సంచార చేపల విక్రయ వాహనాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్కో వాహనానికి రూ.10 లక్షలు ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు. 

60 శాతం సబ్సిడీతో రూ.4 లక్షలకే మహిళా సంఘాలకు ఈ వాహనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సబ్సిడీ మొత్తాన్ని సైతం బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలుగా సెర్చ్ ఇప్పించనుందని చెప్పారు. మహిళా సంఘం సభ్యుల కోసం త్వరలో యూనిఫాం చీరలు కూడా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాకాలను మహిళలు అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్​నాయకులు పాల్గొన్నారు.