
మరికల్, వెలుగు: మరికల్ మండలకేంద్రంలోని మంగలోని వంపులో ఎస్‌డీఎఫ్ నిధులతో నిర్మించిన కల్వర్టును నారాయణపేట ఎమ్మెల్యే డా.పర్ణికారెడ్డి గురువారం పూజచేసి ప్రారంభించారు. ఏండ్ల నుంచి ఈ సమస్యను పరిష్కరించాలని నాయీబ్రాహ్మణులు.. ఇటీవల ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన ఆమె సమస్యను పరిష్కరించాలని జిల్లా నాయకుడు సూర్యమోహన్రెడ్డికి సూచించారు. ఆయన వారం రోజుల్లో పనిని పూర్తి చేయించారు. అనంతరం ఎమ్మెల్యేను నాయీబ్రాహ్మణులు శాలువాతో సత్కరించారు.