విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు : రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.  బల్మూర్, గోదల్ గ్రామాల్లో బుధవారం వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. బల్మూర్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ను తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలందించాలని సిబ్బందికి సూచించారు. 

అనంతరం హైస్కూల్లో నూతనంగా నిర్మించిన టాయిలెట్స్ ను, గోదల్ జామా మసీదులో నిర్మించిన కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్​ను ప్రారంభించారు. గోదల్ హైస్కూల్లో వావిలాల వెంకటేశ్వర్ రెడ్డి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.  

రాయల్ ఫిల్లింగ్ స్టేషన్ పున:ప్రారంభం

ఉప్పునుంతల, వెలుగు: ఉప్పునుంతలలో రాయల్ ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంక్) ను యజమాని ఎడ్ల నరేశ్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ బుధవారం పున:ప్రారంభించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ నరసింహారెడ్డి, మామిళ్లపల్లి దేవస్థానం చైర్మన్ నరసింహారావు 
తదితరులున్నారు. 

చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల- ప్రొసీడింగ్స్

అమ్రాబాద్, వెలుగు: పదర మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద చెంచులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ బుధవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందించారు. కాంగ్రెస్​మండల అధ్యక్షుడు రామలింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్, నాయకులు పాల్గొన్నారు.