ఎమ్మెల్సీ వర్గానికి టెంపుల్  కమిటీ చైర్మన్

ఎమ్మెల్సీ వర్గానికి టెంపుల్  కమిటీ చైర్మన్

 

  •     ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే డుమ్మా

గద్వాల, వెలుగు: ఐదో శక్తిపీఠం అలంపూర్  బాల బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ కమిటీ చైర్మన్  పదవి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సిఫారసు చేసిన వ్యక్తికి దక్కింది. దీంతో బుధవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే అబ్రహం డుమ్మా కొట్టారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వరి టెంపుల్  కమిటీ చైర్మన్  కోసం ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి  సిఫారసు లెటర్లు ఇవ్వగా, ఎమ్మెల్సీ పంపిన లెటర్​కు ప్రభుత్వం ఓకే చెప్పింది.

Also Read:నా బ్యాగ్ లో బాంబు ఉంది : ఎయిర్ పోర్టును షేక్ చేసిన మహిళ

చైర్మన్ గా చిన్న కృష్ణయ్య..

జోగులాంబ బాల బ్రహ్మేశ్వరి అమ్మవారి టెంపుల్  చైర్మన్ గా కోనేరుకు చెందిన చిన్న కృష్ణయ్య బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. చంద్రకళ వెంకట రమణారెడ్డి, రఘు, సత్తన్న, వెంకటేశ్వర్ రెడ్డి, చాకలి వెంకటేశ్వర్లు, అంపయ్య, గొల్ల కేశన్న, అడివప్ప, సత్యనారాయణ, రమేశ్​బాబు, సురేఖ, ఎక్స్ అఫిషియో  మెంబర్ గా ఆనంద్ శర్మ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం చిన్న కృష్ణయ్యను చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఢిల్లీ అధికార ప్రతినిధి మందా జగన్నాథం, జడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ టెంపుల్​ డెవలప్​మెంట్​కు కృషి చేయాలని సూచించారు. దేవాలయ శాఖ అసిస్టెంట్  కమిషనర్ శ్రీనివాసరాజు, ఈవో పురేందర్ పాల్గొన్నారు.