టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి

టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి

మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మందమర్రి టోల్ ప్లాజా  సిబ్బందిపై దాడి చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయలేకుండా... ముందున్న లారీని త్వరంగా పంపించకుండా తనను వెయిట్ చేయిస్తారా..? అంటూ టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. 

వీఐపీలకు కేటాయించిన ఫ్రీ లేన్ నుండి రాకుండా టోల్ వసూలు చేసే లేన్ లోకి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కారు వచ్చింది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే తన కారు సైరన్ కొడుతుండడంతో మాట్లాడడానికి టోల్ ప్లాజ్ సిబ్బంది అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలోనే తమపై ఎమ్మెల్యే దాడి చేశారని టోల్ ప్లాజా ఆరోపించారు. ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే మద్యం తాగి ఉన్నారని చెబుతున్నారు. ఈ ఘటన రాత్రి 11 గంటల 30 నిమిషాలకు జరిగినట్లు తెలుస్తోంది. టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి చేసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.