సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్ పై ఎమ్మెల్యే అనుచరుల దాడి

సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్ పై ఎమ్మెల్యే అనుచరుల దాడి

ఆర్టీసీ బస్సును అడ్డుకుని డ్రైవర్​తో గొడవ

మహబూబ్​నగర్/షాద్​నగర్,​ వెలుగు:
ఎమ్మెల్యే కారుకు సైడ్ ​ఇయ్యలేదంటూ ఆర్టీసీ బస్సును అడ్డుకుని ఎమ్మెల్యే అనుచరులు డ్రైవర్​తో ఘర్షణకు దిగారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఆదివారం మంత్రి శ్రీనివాస్​గౌడ్​తల్లి దశదినకర్మకు హాజరయ్యేందుకు హైదరాబాద్​లోని ఓ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు, కాన్వాయ్​తో ఉదయం బయల్దేరారు. షాద్​నగర్ ​టోల్​ ప్లాజా దాటిన తర్వాత ఎదురుగా వెళ్తున్న టీఎస్​ ఆర్టీసీ బస్సును ఓవర్ ​టేక్​ చేసే ప్రయత్నం చేశారు. అయితే కాన్వాయ్​కి సైడ్​ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. కారును బస్సుకు అడ్డంగా ఆపి డ్రైవర్​ డోర్​ వద్ద కర్రలతో కొడుతూ, బయటకు రా.. ఎమ్మెల్యే బండికే సైడ్​ ఇవ్వవా అంటూ తిట్లు మొదలుపెట్టారు. అదే రూట్​లో మరో బస్​లో వెళ్తున్న ఓ ప్రయాణికుడు ఈ ఘటనను చిత్రీకరించి సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేశాడు. ఆ వీడియో వైరల్​ అవుతోంది. బస్సుకు అడ్డంగా నిలిపిన వెహికల్ ​వినోద్​ అనే పేరు మీద రిజిస్ట్రేషనైంది. ఈ వెహికల్​పై 14 చలానాలు ఉండగా అందులో 12 ఓవర్​ స్పీడ్​వి కావడం గమనార్హం.