చేనేతకు  పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం

చేనేతకు  పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం
  •     భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు 

శాయంపేట, వెలుగు : శాయంపేట చేనేత సహకార సంఘానికి పూర్వవైభవాన్ని తీసుకువచ్చి కార్మికులకు పూర్తి స్థాయిలో పనిదొరికే విధంగా చూస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కార్మికులకు హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లా శాయంపేటలోని చేనేత సొసైటీని మంగళవారం ఎమ్మెల్యే సందర్శించి, కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సొసైటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత సంఘంలో పేరుకుపోయిన బకాయిలు

వివిధ సమస్యలను  జౌళిశాఖ  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తామన్నాన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్​ సెంటర్లో  కేక్ కట్ చేసి సంబురాలు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్

మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, జిల్లా నాయకులు  చిందం రవి, బాసని చంద్రప్రకాశ్​, అబ్బు ప్రకాశ్​రెడ్డి, బాసాని మార్కండేయా, మారపెల్లి కట్టయ్య, ఏరుగొండ శంకర్, చింతల రవిపాల్, నిమ్మల రమేశ్, సాధు నాగరాజు, మారపెల్లి వరదరాజు, మాడిశెట్టి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు 

మొగుళ్లపల్లి, వెలుగు : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సమక్షంలో మొగుళ్లపల్లి మండలంలోని బీఆర్​ఎస్​ నేతలు కాంగ్రెస్​లో చేరారు. మంగళవారం ఎంపీపీ యార సుజాతా సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ పోల్లేని రాజేశ్వర్ రావు, ఎంపీటీసీల ఫోరం మండల కన్వీనర్ మంద సుధాకర్ తో పాటు పలు గ్రామాల సర్పంచ్​లు, నాయకులు హస్తం పార్టీలో చేరారు. వాళ్లందరికీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కుమార్, జనరల్ సెక్రటరీ రాము, మొగుళ్లపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఖ్యాత రాజు రమేశ్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన బీఆర్​ఎస్​ పార్టీ క్యాడర్​ ను తిరిగి మళ్లీ కాంగ్రెస్​ లో చేర్పించడంపై అటు పాత క్యాడర్ ఇటు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.