అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు : ఎమ్మెల్మే గూడెం మహిపాల్ రెడ్డి

అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు : ఎమ్మెల్మే గూడెం మహిపాల్ రెడ్డి
  •     ఎమ్మెల్మే గూడెం మహిపాల్​ రెడ్డి 

అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగు: అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పటాన్​చెరులోని క్యాంపు ఆఫీస్​ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో 194 మంది లబ్ధిదారులకు రూ.కోటి 94 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి పేదింటి ఆడిపిల్లల వివాహాలకు కొండంత అండగా నిలుస్తుందన్నారు. 

అమీన్​పూర్​ డివిజన్​ పరిధిలోని సుల్తాన్​పూర్​కు చెందిన కటకం శాలిని అనారోగ్యంతో బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం సీఎంఆర్​ఎఫ్​ దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ.3.50లక్షల ఎల్​వోసీ పత్రాలను ఆమె కుటుంబీకులకు అందజేశారు.