అమీన్పూర్, పటాన్చెరు, వెలుగు : సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన ముంతాజ్ బేగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆమె సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ.5 లక్షలు మంజూరయ్యాయి.
శుక్రవారం పటాన్‌చెరులోని తన క్యాంపు కార్యాలయంలో బాధితురాలు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఎల్వోసీ అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, అమీన్పూర్ మాజీ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, నాయకులు భిక్షపతి, ఇమ్రాన్, సాయినాథ్ గౌడ్ పాల్గొన్నారు.
