- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్(గుమ్మడిదల), వెలుగు: క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల పట్టణంలో సీజీఆర్ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఓపెన్ టూ ఆల్ కబడ్డీ, వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు, యువకుల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేందుకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీజీఆర్ ట్రస్టు చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గోవర్దన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, హుస్సేన్, సీఐ రమణారెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.
రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పటాన్చెరు మండలం క్యాసారంలో రూ.30 లక్షలతో కల్వర్టు, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లక్డారంలో రూ.20లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో చేపట్టే డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పటాన్చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బసప్ప కుటుంబ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అందజేశారు.
ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్, మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, నాయకులు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, రమేశ్, లక్ష్మణ్, గోపాల్, క్యాసారం సర్పంచ్ సంగీత గోవర్దన్‌రెడ్డి, శ్రీశైలంయాదవ్ పాల్గొన్నారు.
