ఇసుక బావి బ్రిడ్జి నిర్మిస్తానని ఎమ్మెల్యే మాట తప్పారు : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

ఇసుక బావి బ్రిడ్జి నిర్మిస్తానని ఎమ్మెల్యే మాట తప్పారు : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

రామచంద్రాపురం, వెలుగు :  అమీన్​పూర్, రామచంద్రాపురం ప్రాంతాలను కలిపే ఇసుక బావి బ్రిడ్జిని నిర్మిస్తానని గతంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట ఇచ్చి తప్పారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోదావరి అంజిరెడ్డి, ఎడ్ల రమేశ్​, ఆదెల్లి రవీదర్​ఆరోపించారు. గురువారం ఇసుక బావి వద్ద వంతెనను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న పాటి వర్షానికే వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తోందని, రెండేండ్ల కింద ఇదే బ్రిడ్జిపై కారుతో సహా ఓ వ్యక్తి గల్లంతై చనిపోయాడని తెలిపారు. 

ప్రమాదాలు జరుగకుండా వెంటనే కొత్త బ్రిడ్జిని నిర్మిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి మరచిపోయారని మండిపడ్డారు. తమకు ఆదాయం వచ్చే ప్రాంతాలలోనే వంతెనలు, రోడ్లు వేస్తున్నారని, సామాన్య ప్రజల సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. వెంటనే వంతెన నిర్మించి ప్రమాదాల బారి నుండి కాపాడాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు  చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆగారెడ్డి, బలరాం, పెంటారెడ్డి, పూర్ణిమ, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.