గరిక పాటి ప్రవచనాలు గగన సాటి

గరిక పాటి ప్రవచనాలు గగన సాటి
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే  హరీశ్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు : గరిక పాటి ప్రవచనాలు గగన సాటి అని, ప్రవచనాలు విన్నంత సేపు మనసు కుదుట పడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే  హరీశ్ రావు అన్నారు. సోమవారం రాత్రి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో జరిగిన గరిక పాటి నరసింహా రావు  ప్రవచనాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గరిక పాటి రామాయణం, మహాభారతం లాంటి పురాణాలు  ప్రజలకు అర్థమయ్యేలా వివరించారన్నారు. సిద్దిపేట లో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

క్యూఆర్ కోడ్ స్కాన్ ప్రారంభించిన  ఎమ్మెల్యే

క్యూఆర్ కోడ్ స్కాన్ తో క్షణాల్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట మోడల్ బస్టాండ్ లో క్యూర్ కోడ్ తో డబ్బులు విత్ డ్రా చేసుకొనే మిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఏటిఎం మాదిరిగానే క్యూఆర్ మినీ ఏటీఎం పనిచేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలోనే టీ హబ్ ద్వారా రూపొందించిన ఈ టెక్నాలజీని సిద్దిపేటలో ప్రారంభించడం విశేషమన్నారు. కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ చైర్మన్ చీకోటి నరేశ్​గుప్తా, కో చైర్మన్ షేక్ షమీం, తెలంగాణ స్టేట్ డీలర్ రమేశ్, జిల్లా డీలర్ జనార్ధన్ పాల్గొన్నారు.