తెలంగాణ రైతుల కడుపు నింపి ఇతర రాష్ట్రాలకు వెళ్లు

తెలంగాణ రైతుల కడుపు నింపి ఇతర రాష్ట్రాలకు వెళ్లు

తెలంగాణ రైతులను పట్టించుకోని సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల రైతుల సమస్యలను పట్టించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని వేరే రాష్ట్రాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలపై చర్చించడం గమనార్హమన్నారు. రాజకీయాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రైతులపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు.

రైతులు బతకడానికి బీమా లేదు గానీ చనిపోతే 5లక్షల బీమా ఇస్తున్నారన్నారు జగ్గారెడ్డి. రైతులు బతకడానికి ప్రోత్సాహం ఇస్తున్నారా లేక చనిపోవడానికి ప్రోత్సహమిస్తున్నారా అని ఆయన నిలదీశారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేనాథుడే కరువయ్యారన్నారు. టీఆర్ఎస్ నాయకులు పదే పదే కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నారని..అసలు 8ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు. లక్షల రూపాయల రైతుల రుణమాఫి కూడా చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అవ్వగానే మొదటి సంతకం చేసింది ఉచిత విద్యుత్ ఫైల్ మీదే అని గుర్తుచేశారు.  ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. తెలంగాణ రైతుల కడుపు నింపి ఇతర రాష్ట్రాల సమస్యలను పట్టించుకోవాలని కేసీఆర్ కు జగ్గారెడ్డి సూచించారు. 

మరిన్ని వార్తల కోసం

పాతిక వేలకు ప్లాస్టిక్ బకెట్

రేవంత్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం