రేవంత్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం

రేవంత్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం

కులాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను ఏకీభవించడం లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. రెడ్లకు, వెలమలకు ఎటువంటి విభేదాలు లేవన్న ఆయన.. చొక్కారావు, పీవీ నరసింహా రావు వంటి నేతలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశారన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని మహేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్న ఆయన.. కాంగ్రెస్ చరిత్ర తెలియని వాళ్లు ఏదో మాట్లాడితే వాటిని పార్టీ వ్యాఖ్యలుగా భావించొద్దని కోరారు.

కాగా రెడ్డి కులానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రతి రెడ్డికి 10ఎకరాలు ఉన్నప్పుడే రాజ్యం, రాజకీయం రెడ్ల చేతుల్లో ఉంటుందని రేవంత్ అన్నారు. రెడ్లను నమ్ముకున్న వాళ్లు ఎవరూ మోసపోలేదని.. పార్టీలు గెలవాలంటే రెడ్లకే పార్టీల పగ్గాలు అప్పజెప్పాలని వ్యాఖ్యానించారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టి వెలమలైన పద్మనాయకులను దగ్గరికి తీశాడని అందుకే కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్న రేవంత్ కామెంట్స్ పై ఇప్పటికే పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

కులాల మధ్య రేవంత్ చిచ్చుపెడుతున్నారు

ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీపై నమ్మకం కలిగించాలి