టీఆర్ఎస్, బీజేపీ రైతుల పొట్ట కొట్టొద్దు

టీఆర్ఎస్, బీజేపీ రైతుల పొట్ట కొట్టొద్దు

టీఆర్ఎస్, బీజేపీలు రైతుల పొట్ట కొట్టొద్దన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. టీఆర్ఎస్, బీజేపీలు బకాసురుడి పాత్ర పోషిస్తున్నాయన్నారు. రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటుండన్నారు. కాంగ్రెస్ భీముడి పాత్ర పోషించి బకాసురుడిని  చంపుతుందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రైతుల బతుకులతో రాజకీయం చేస్తున్నాయన్నారు. సీఎం చెప్పక ముందే... అమిత్ షా ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పారన్నారు. సీఎం ఇచ్చిన బ్రీఫ్ నోట్  నే... అమిత్ షా చెప్పారన్నారు. ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారన్నారు. కాంగ్రెస్ ను కట్టడి చేయడం కోసమే  టీఆర్ఎస్..బీజేపీ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. వరి ధాన్యం  కొనని ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు. రైతులకు అండగా ఉంటామన్నారు.

జనవరి 2 వరకు ర్యాలీలు, సభలు బంద్

దేశంలో 437 కు చేరిన ఒమిక్రాన్ కేసులు