అభివృద్ధి పథంలో ఆదిలాబాద్​.. ఎమ్మెల్యే జోగు రామన్న

అభివృద్ధి పథంలో ఆదిలాబాద్​.. ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ఆదిలాబాద్​జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణాభివృద్ధికి ప్రభుత్వం రూ.320 కోట్లు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రిమ్స్ కు 40 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల కేటాయించినందుకు గాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమందర్, వైస్ చైర్మన్ జహిర్ రంజాని, ఎంపీపీలు మార్శెట్టి గోవర్ధన్, గండ్రత్ రమేష్, లీడర్లు అజయ్​, మెట్టు ప్రహ్లాద్, తదితరులు పాల్గొన్నారు.