ఫైనల్‌లో కోహ్లీ షో.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి కప్పు కొట్టిన ఆర్సీబీ

ఫైనల్‌లో కోహ్లీ షో.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి కప్పు కొట్టిన ఆర్సీబీ

RCBvsGT: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సంచలన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) పై గెలిచి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ చారిత్రాత్మక గెలుపుతో ఐపీఎల్ చరిత్రలో బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి దిగ్గజ జట్ల సరసన ఆర్సీబీ సగర్వంగా నిలిచింది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ తీసుకున్న ఆర్సీబీ.. గుజరాత్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత 156 పరుగుల టార్గెట్‌ను కింగ్ కోహ్లీ వన్-మెన్ షోతో చెలరేగిపోయాడు. 

 పవర్‌ప్లే ఆర్సీబీ దండయాత్ర: 
ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ పవర్‌ప్లేలో నెక్ట్స్ లెవెల్ స్టార్ట్ ఇచ్చారు. గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడుతూ వీరిద్దరి మధ్య 62 పరుగుల ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌తో మ్యాచ్‌ను వన్-సైడ్ చేశారు. అయితే ఈ ప్రమాదకరమైన జోడీని గుజరాత్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ దెబ్బకొట్టాడు. కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి ఊపుమీదున్న వెంకటేశ్ అయ్యర్‌ను సిరాజ్ అవుట్ చేశాడు. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి కగిసో రబాడకు క్యాచ్ ఇచ్చి అయ్యర్ పెవిలియన్ చేరాడు.

ఆర్సీబీకి బ్రేకులు వేసిన రషీద్ ఖాన్: 
వెంకటేశ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ ఘోరంగా నిరాశపరిచాడు. కేవలం 1 రన్ మాత్రమే చేసి కగిసో రబాడ బౌలింగ్‌లో అర్షద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి చేతులెత్తేశాడు. ఈ దశలో వచ్చిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ వచ్చి రావడంతోనే ఒక ఫోర్, సిక్స్ బాది ఫుల్ జోష్ చూపించినా.. ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. గుజరాత్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పటిదార్ అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి కృనాల్ పాండ్యాను కూడా రషీద్ ఖాన్ ఎల్బీడబ్ల్యూ (LBW) చేయడంతో ఆర్సీబీ 91 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కాస్త ఇబ్బందుల్లో పడింది. 

కోహ్లీ విధ్వంసం: 
4 వికెట్స్ పడ్డాక మ్యాచ్‌ను మళ్లీ ఆర్సీబీ వైపు తిప్పే బాధ్యతను టిమ్ డేవిడ్ చెలరేగిపోయాడు. బౌండరీలతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అయితే భారీ షాట్ కొట్టే క్రమంలో అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి డేవిడ్ డగౌట్‌కు చేరుకున్నాడు. కానీ మరో ఎండ్‌లో మొండిగా నిలబడ్డ ఆర్సీబీ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అసలైన క్లాస్ చూపించాడు. గుజరాత్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ తన ఐపీఎల్ కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 75 పరుగులతో నాటౌట్) బాదాడు. కోహ్లీ అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీకి తిరుగులేని విజయాన్ని అందించాడు. నిన్న మొన్నటి వరకు ఈ సాల కప్ నమ్దే అన్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఇప్పుడు ఈ సాల కూడా కప్ నమ్దూ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.