BSNLలో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు: మంచి జీతం.. బిటెక్ చేసినోళ్లకు గోల్డెన్ ఛాన్స్..

BSNLలో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు: మంచి జీతం.. బిటెక్  చేసినోళ్లకు గోల్డెన్ ఛాన్స్..

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: జూనియర్ టెలికాం ఆఫీసర్.

మొత్తం ఖాళీలు: 100 (ఏపీలో 1, తెలంగాణలో 2)  ఖాళీలు ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇనుస్ట్రుమెంటేషన్​లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. లేదా ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్) లేదా ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) చదివి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 4.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1000. 

లాస్ట్ డే: జులై 3. 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: 2026, ఆగస్టు. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.externalexam.bsnl.co.in ను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్ 
రాత పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో, మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. సెక్షన్–Iలో ఇంజినీరింగ్ స్ట్రీమ్ సెక్షన్-–I  నుంచి 50 ప్రశ్నలు 200 మార్కులకు, సెక్షన్-–IIలో  ఇంజినీరింగ్ స్ట్రీమ్ సెక్షన్-–II నుంచి 50 ప్రశ్నలు 200 మార్కులకు, సెక్షన్–IIIలో జనరల్ ఎబిలిటీ టెస్ట్ సెక్షన్ నుంచి 20 ప్రశ్నలు 80 మార్కులకు మొత్తం 480 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సరైన సమాధానికి  4 మార్కులు ఇస్తారు.  ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు  కోత విధిస్తారు.