నరరూప రాక్షసుడితో పెళ్లికి నిరాకరించిందని ఆమె అమాయక బిడ్డను కొట్టి చంపేశాడు దుర్మార్గుడు. చాక్లెట్లు ఇప్పిస్తానని తీసుకెళ్లి ఎనిమిది సార్లు కాంక్రీట్ రోడ్డుకు కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయిన హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు సోష ల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేశాయి. చిన్న పిల్లాడు అన్న దయదాక్షిణ్యం లేకుండా కరుడుగట్టిన ఉన్మాది ఏడాదిన్నర అమాయకపు బాలుడి ప్రాణాలు తీసినందుకు వాటిని ఎన్ కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
అత్యంత దారుణమైన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లోని యాదవ్ నగర్ లో జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో దృశ్యాలు గుండెను పిండేస్తున్నాయి. అభం శుభం తెలియని బాలుడిని ఉన్మాదంతో ఎనిమిది సార్లు రోడ్డుకేసి కొట్టిన దృశ్యాలు కంటనీరు పెట్టించాయి. ఆ దెబ్బలకు చిన్ని హృదయం ఉలుకుపలుకు లేకుండా పడిపోవడం చూసేవారికి గుండె పగిలినంత పనైంది. ఈఘటన అనంతరం తప్పించుకు పారిపోతున్నర నిందితుడిని పోలీసులు షూట్ చేసి మరీ పట్టుకున్నారు.
ఎందుకీ దారుణం..?
యాదవ్ నగర్ కు చెందిన రతి అనే మహిళ భర్తతో గొడవపడి ఏడాదిన్నర వయసున్న బాబుతో వేరుగా ఉంటోంది. అదే సమయంలో పరిచయమయ్యాడు సమీప బంధువు విరాజ్. తరుచూ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో రతి చనువుగా ఉండటంతో పెళ్లి చేసుకోవాలని కోరాడు. తన కొడుకు భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని పెళ్లికి నిరాకరించింది. దీంతో అడ్డుగా ఉన్న బాలుడిని తొలగించుకోవాలని పథకం వేశాడు దుర్మార్గుడైన విరాజ్.
►ALSO READ | ఆరావళి పర్వతాలకు మైనింగ్ ముప్పు.. గనుల తవ్వకం వల్ల మిగిలేది విధ్వంసమే
అదును కోసం ఎదురు చూసిన విరాజ్.. చాక్లెట్ ఇప్పిస్తానని రతి ఏడాదిన్నర కొడుకును తీసుకెళ్లాడు. ఎవరూ లేని చోట బాలుడిని కాంక్రీటు రోడ్డుకి కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.
అభం శుభం తెలియని బాలుడిని హత్య చేసి పారిపోతున్న దుర్మార్గుడిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఛేజ్ చేసే ప్రయత్నంలో షూట్ చేశారు. దీంతో నిందితుడి విరాజ్ కు కాలిలో బుల్లెట్ గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ ఘటన వీడియో చూసిన, ఈ వార్త విన్న ప్రతి ఒక్కరి గుండెను పిండేసింది. ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా ఉండాలంటే బాలుడి హత్య చేసిన నరరూప రాక్షసుడిని ఎన్ కౌంటర్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.
