కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టిందే ‘పల్లా రాజేశ్వర్ రెడ్డి’ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టిందే ‘పల్లా రాజేశ్వర్ రెడ్డి’  : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
  • స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, వెలుగు: జనగామ జిల్లాలోని గజదొంగకు ముగ్గురు స్టూవర్ట్​పురం దొంగలు తోడయ్యారని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్టేషన్​ ఘన్​పూర్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్​రావు, పల్లా రాజేశ్వర్​ రెడ్డిపై ఫైర్​ అయ్యారు. కేసీఆర్​ కుటుంబంలో చిచ్చు పెట్టింది పల్లా రాజేశ్వర్​రెడ్డి అని తెలిపారు. 

టీడీపీని హోల్​సేల్​గా అమ్మిన నీచ చరిత్ర ఎర్రబెల్లి దయాకర్​రావుకు ఉందన్నారు. కేసీఆర్​ చుట్టూ కుక్కలా తిరిగిన ఎర్రబెల్లి రూ.వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. కేటీఆర్, సంతోష్​రావు సంపాదించిన ఆస్తులకు పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. 

వీళ్లందరూ తాటికొండ రాజయ్యను ఉద్ధరించడానికి రాలేదని, బొంద పెట్టడానికే వచ్చారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చేసిన చిల్లర పనులతో నియోజకవర్గం తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. జనగామ జిల్లా అభివృద్ధిపై బీఆర్ఎస్​ తప్పుడు ప్రచారం చేస్తోందని, తాను ఎమ్మెల్యే అయిన తర్వాతే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని తెలిపారు. రానున్న మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.