పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే  కవ్వంపల్లి సత్యనారాయణ

పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే  కవ్వంపల్లి సత్యనారాయణ

శంకరపట్నం, వెలుగు: పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్  కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం శంకరపట్నం రైతు వేదికలో 63 మందికి కల్యాణ లక్ష్మి, 10 మందికి షాదీ ముబారక్ చెక్కులు, 51 మందికి సీఎంఆర్ఎఫ్  చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కేశవపట్నం సర్పంచ్ రాజేంద్రప్రసాద్, మాజీ జడ్పీటీసీ, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, డీసీసీ కార్యదర్శి గట్టు తిరుపతి, తహసీల్దార్ సురేఖ, ఇన్‌‌చార్జి ఎంపీడీవో ప్రభాకర్ పాల్గొన్నారు.