
- ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్ వెలుగు: తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు వెయ్యి మంది వరకు వైద్య శిబిరానికి వచ్చి కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరాన్ని రాజగోపాల్ రెడ్డి సందర్శించి పరీక్షలు చేయించుకుంటున్నవారితో మాట్లాడారు.
ఎంతమందికి ఆపరేషన్లు అవసరమని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. భోజన వసతి కల్పించి వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫినిక్స్ ఫౌండేషన్, శంకరకంటి ఆస్పత్రుల ఆధ్వర్యంలో సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలకు భారీ స్పందన లభిస్తుందని తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఏర్పాటు చేసిన శిబిరాల్లో 5,789 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 1,248 మందికి కంటి ఆపరేషన్లు చేసినట్టు చెప్పారు. అనంతరం చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో పునరుద్ధరించిన పురాతన ఊట బావులను, మహిళా భవనాన్ని, బీసీ భవనాన్ని ప్రారంభించారు.