చౌటుప్పల్ మాస్టర్ ప్లాన్ పక్కాగా ఉండాలె : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ మాస్టర్ ప్లాన్ పక్కాగా ఉండాలె : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ పక్కాగా ఉండాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపల్ ఆఫీస్‌లో అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు.  ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్‌ మ్యాపులను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచాలని

తాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని సూచించారు.  వర్షాకాలంలో ఊర చెరువు కింద ప్రాంతం జలమయం అవుతున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో ఉన్న చెరువుల్లోకి  డ్రైనేజ్ వాటర్‌‌ వదలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ పరిధిలోని ఫార్మా ఇండస్ట్రీస్ పొల్యూషన్‌ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తీరు మార్చుకోకపోతే మూయిస్తామని హెచ్చరించారు.   

బంజారా భవన్ ఏర్పాటుకు కృషి

సంస్థాన్ నారాయణపురం, వెలుగు : సంత్ సేవలాల్ స్ఫూర్తితోనే నియోజకవర్గంలో బెల్ట్ షాపులను మూసివేయించానని  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బుధవారం  సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గిరిజనశాఖ, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సేవలాల్ జయంతిలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బంజారా భవన్‌తో పాటు గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులందరికీ పోడు పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.  ఎంపీపీలు గుత్త ఉమాదేవి, తాడూరి వెంకటరెడ్డి, జడ్పీటీసీ ఏవి రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్ ఉన్నారు.