
యాదాద్రి, వెలుగు: పెండింగ్‌లో ఉన్న రుద్రవెళ్లి హైలెవల్ బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మూసీపై బ్రిడ్జి నిర్మాణం 12 ఏండ్లుగా పిల్లర్లకే పరిమితమై పోయిందన్నారు. వరదలు వచ్చినప్పుడల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పాత కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని ఆయన కోరారు. సంగెం వద్ద మూసీపై బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్లు పిలవాలన్నారు. భువనగిరి -చిట్యాల రోడ్డును 'హ్యామ్' స్కీమ్ కింద నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించాలని ఎమ్మెల్యే కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.