దేశంలోని కమ్యూనిస్టులు ఏకం కావాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

దేశంలోని కమ్యూనిస్టులు ఏకం కావాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చి ఐక్యం చేయాలి
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపు

గోదావరిఖని, వెలుగు : మతోన్మాద బీజేపీ  హిందుత్వాన్ని ముందుపెట్టి అభ్యుదయవాదులను లేకుండా చేస్తోందని, ఆ పార్టీ  విధానాలను ఎదుర్కోవడానికి దేశంంలోని కమ్యూనిస్టులు ఏకం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సీపీఐ ఆవిర్భవించి వందేండ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం గోదావరిఖనిలోని భాస్కర్​రావు భవన్​లో సింగరేణి కాలరీస్​వర్కర్స్​యూనియన్(ఏఐటీయూసీ) బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక కుటుంబాల సమ్మేళనం జరిగింది. 

ఇందులో వంద మంది కార్మిక కుటుంబాలను ఘనంగా సన్మానించా రు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చి కమ్యూనిస్టుల ఐక్యతకు కృషి చేయాలని కోరారు. ఆపరేషన్ కగార్​ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ బూటకపు ఎన్​కౌంటర్లలో మావోయిస్టులను చంపుతున్నా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

1942లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్​ను ఏర్పాటు చేసి అనేక కార్మిక హక్కుల కోసం ఏఐటీయూసీ పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోశం, ఎల్.ప్రకాష్, కవ్వంపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.