
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గంలోని బతుకమ్మ ఘాట్ల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్తీ, గ్రామ కూడళ్లలో విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు పారిశుధ్య లోపం లేకుండా చూడాలని పేర్కొన్నారు.
ఘాట్ల వద్ద ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముర్రెడు వాగు ప్రధాన ఘాట్ అభివృద్ధికి రూ. 50లక్షలు మంజూరు చేయించి శంకుస్థాపన చేశామని, త్వరలో పనులు పూర్తి అవుతాయని పేర్కొన్నారు.