
యూనిక్యు ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) గుర్తింపు సేవలను మరింత సులభం చేయడానికి కొత్త ఆధార్ మొబైల్ యాప్‌ను తీసుకొస్తుంది. ప్రస్తుత mAadhaar స్థానంలో వస్తున్న ఈ యాప్ AI, ఫేస్ ID లాగిన్, QR వెరిఫికేషన్, మెరుగైన భద్రతతో ఉంటుంది. దీని ద్వారా మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటి వివరాలు అన్ని అప్ డేట్ చేసుకోవచ్చు, అలాగే మీ ఆధార్ డౌన్‌లోడ్ ఇంకా ఆధార్ ఆప్ డేట్ ట్రాక్ చెయ్యొచ్చు. మీకు కావాలనుకుంటే ఆధార్ PVC కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.
అయితే, మొబైల్ నంబర్ అప్ డేట్ వంటి మార్పులకు బయోమెట్రిక్ అవసరం. ఈ యాప్ వచ్చాక ఆధార్ సెంటర్ వద్ద గంటల తరబడి ఎదురుచూసే అవసరం ఉండదు. ఈ యాప్ డిసెంబర్ 2025 నాటికి విడుదల కావొచ్చు. బ్యాంకు అకౌంట్ తెరవడానికి, సబ్సిడీ పొందడానికి, ప్రభుత్వ సహా ప్రైవేట్ సేవలు పొందటానికి ఆధార్ ఒక ముఖ్యమైన గుర్తింపు డాక్యుమెంట్.
Also Read : చిన్న గ్యారేజ్ నుంచి ప్రపంచ దిగ్గజం వరకు
అయితే ఆధార్ సేవలను మరింత వేగంగా అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రవేశపెట్టారు. దింతో ముఖాన్ని చూపించి యాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చు. వేగంగా , సురక్షితంగా ఆధార్ వివరాలను వెరిఫై చేయడానికి క్యూఆర్ కోడ్ ద్వారా చెక్ చేసే అవకాశం ఉంటుంది.
ఇంకా యూజర్ అనుమతితో ఆధార్ డేటా డిజిటల్‌గా షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కొత్త యాప్ ద్వారా ఆధార్ సేవలను సులభంగా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. పేరు, పుట్టిన తేదీ నుండి చిరునామా (అడ్రస్) వంటి వివరాలను మార్చుకోవచ్చు. కావాలనుకుంటే ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కూడా. ఇంకా మీరు చేసిన మార్పుల స్టేటస్ తెలుసుకోవచ్చు. అవసరం అనుకుంటే పీవీసీ (ప్లాస్టిక్) ఆధార్ కార్డు ఆర్డర్ చేస్తే మీ ఇంటికే వస్తుంది.
కానీ కొన్ని ముఖ్యమైన మార్పులకు సంబంధించి లేదా ఆధార్ దుర్వినియోగం నివారించడానికి మీరు తప్పకుండా ఆధార్ సర్వీస్ సెంటర్ వెళ్లి వ్యక్తిగతంగా బయోమెట్రిక్ అతేంటికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ కొత్త యాప్ వల్ల ఆధార్ కేంద్రాల వద్ద ఉండే రద్దీ ఇంకా తగ్గుతుంది.