బీఆర్ఎస్ లీడర్లు రైతుబంధులో కోట్లు కొల్లగొట్టారు : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి

బీఆర్ఎస్ లీడర్లు రైతుబంధులో కోట్లు కొల్లగొట్టారు : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి
  • నాగార్జున సాగర్​ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి

హాలియా, వెలుగు: గత ప్రభుత్వ బీఆర్​ఎస్​ పదేండ్ల పాలనలో తిరుమలగిరి(సాగర్​) మండలంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిని బీఆర్ఎస్ రాజకీయ నాయకుల అండతో సాగులో లేకున్నా పట్టాదార్ పాస్ బుక్ చేసుకుని కోట్ల రూపాయల రైతుబంధు నిధుల అవినీతికి పాల్పడ్డారని నాగార్జున సాగర్​ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆరోపించారు.

  గురువారం నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌లో  ఎమ్మెల్యే నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  మాజీ సీఎల్పీ లీడర్​కుందూరు జానారెడ్డి ప్రత్యేక దృష్టి తో తిరుమలగిరి సాగర్ మండలానికి ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారన్నారు.  సుమారు 3 వేల బోగస్ పట్టాలను తొలగించి కొత్త పట్టా పాస్ పుస్తకాలు మంజూరు అయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.  

ఇప్పటికే చాలామంది రైతులకు ఆన్లైన్ లో భూ భారతి రికార్డులో ఎక్కించారని, మిగిలిన వారిని త్వరలో  భూ భారతి ఆన్లైన్ లో వస్తుందనిచెప్పారు. ఈ పైలెట్ ప్రాజెక్టుని ఎప్పటికప్పుడు ఆటంకాలు రాకుండా చూసినటువంటి నల్గొండ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి , డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్గొండ గడ్డం సాగర్ రెడ్డి , గౌని రాజా రమేష్ , పాల్గొన్నారు