మహమ్మద్ నగర్ (ఎల్లారెడ్డి ), వెలుగు : కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కోరారు. మంగళవారం మహమ్మద్ నగర్ మండలంలోని గిర్నీ తండా, గాలి పూర్, మాక్దుమ్ పూర్, కోమలంచ, తుంకిపల్లి, మహమ్మద్ నగర్, నర్వ గ్రామాల్లో డీసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ తో కలిసి ఎమ్మెల్యే ప్రచారం చేశారు. గాలిపూర్ గ్రామంలో రెబల్ అభ్యర్థి ఎమ్మెల్యే కు శాలువా కప్పి సన్మానించారు. మాక్దూమ్ పూర్ గ్రామంలో బీఆర్ ఎస్, బీజేపీ నుంచి 10 మంది లీడర్లు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు.
కోమలంచ గ్రామంలో పార్టీ అభ్యర్థి బాల్ గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. సర్పంచ్ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు మున్ముందు అవకాశాలు వస్తాయని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ గత 15 సంవత్సరాలు మహమ్మద్ నగర్ మండలం లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేపై విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు ఏండ్ల నుంచి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు వేయిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంట పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ఎస్టీ సెల్ నాయకులు లోక్య నాయక్, సవాయ్ సింగ్, వివిధ గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.

