ఎల్లారెడ్డి, వెలుగు : ఎల్లారెడ్డి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి టౌన్లో పార్టీ శ్రేణులతో కలిసి స్వచ్ఛయాత్రను ప్రారంభించారు. పలు కాలనీల్లో చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లను వాడొద్దన్నారు. ఎల్లారెడ్డి బస్టాండ్ పరిసరాలతోపాటు మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు.
హైవే నిర్మాణంలో భాగంగా తొలగించిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తగిన ప్రదేశంలో తిరిగి ప్రతిష్ఠిస్తామని బజరంగ్ దళ్ సభ్యులకు హామీ ఇచ్చారు. విగ్రహ పరిసరాల్లో రూ.15 లక్షలతో సుందరీకరిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
