నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే మదన్మోహన్ రావు

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే మదన్మోహన్ రావు

లింగంపేట, వెలుగు: వెనకబాటుకు గురైన ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని డెవలప్​ చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్మోహన్​ రావు తెలిపారు. ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడేలా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. ఆదివారం లింగంపేట కాంగ్రెస్​ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు. పోచారం ప్రాజెక్టు, పురాతన కట్టడమైన నాగన్న మెట్లబావిని పర్యాటక కేంద్రాలుగా మారుస్తానని తెలిపారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రూ.5 కోట్లు మంజూరు చేయించానని, త్వరలో పనులు షురూ అవుతాయని చెప్పారు.

కాళేశ్వరం 22 ప్యాకేజీ కింద నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో, కేకేవై  రహదారిపై హై లెవెల్​ వంతెనల నిర్మాణానికి, గాంధారి, తాడ్వాయి మండలాల్లో  మినీ స్టేడియాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన  సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బుర్ర నారాగౌడ్, జొన్నలరాజు, ఎల్లమయ్య, రఫియోద్దీన్, సర్పంచులు సాయిరాం యాదవ్, అట్టెం శ్రీనివాస్, ఏగొండ రవీందర్, పీర్​సింగ్, శివలాల్​నాయక్, నగేశ్, భాస్కర్​గౌడ్, బాలాగౌడ్​ పాల్గొన్నారు.

భీమేశ్వరాలయంలో పూజలు..

తాడ్వాయి: మౌని అమావాస్య సందర్భంగా ఆదివారం సంతాయిపేట స్వయంభు లింగేశ్వరుడిగా పేరుగాంచిన భీమేశ్వర ఆలయాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఆలే  మల్లికార్జున్  దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. వెంకట్​రెడ్డి, కాంగ్రెస్  నాయకులు 
పాల్గొన్నారు.