- కాంగ్రెస్లో చేరిన 70 మంది బీజేపీ నాయకులు
సదాశివనగర్, వెలుగు : ఎల్లారెడి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందుకోసం ఇతర పార్టీల నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం సదాశివనగర్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమవేశంలో బీజీపీ నుంచి 70 మంది నాయకులు కాంగ్రెస్ చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎంతో అభివృద్ది చెందిందన్నారు. సదాశివనగర్ మాజీ వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్యర్యంలో సదాశివనగర్ మండల బీజేపీ ఓబీసీ మోర్చా మండల పార్టీ అధ్యక్షుడు కటికి రమేశ్, బూత్ అధ్యక్షుడు నల్ల సత్యంరెడ్డి, ప్రభులింగం, కుంట సుదర్శన్, శ్రీకాంత్, సుతారి సత్యం, బీఎంసీ చైర్మన్ వంగిటి రాఘవరెడ్డి, నర్సింగ్ రావు,తో పాటు 70 మంది పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంగారెడ్డి, జిల్లా సేవాదళ్అధ్యక్షుడు లింగాగౌడ్, సీడీసీ చైర్మన్ ఇర్షాదోద్దిన్, మాజీ వైస్ ఎంపీపీ నోముల రూపేందర్రెడ్డి, నియోజక వర్గం యూత్ అధ్యక్షుడు సంపత్ గౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వడ్ల రాజేందర్చారి, మండల యూత్ అధ్యక్షుడు అన్వేశ్గౌడ్, మండలంలోని వివిద గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
