
- ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు
సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని లింగంపల్లిని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి లో రూ. 2 కోట్ల 40 లక్షల నిధులతో మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇక్కడికి కంపెనీలు వస్తే నియోజకవర్గ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కాళేశ్వరం 22 వ ప్యాకేజీ పనులకు ప్రభుత్వం రూ 23 కోట్లు విడుదల చేసిందన్నారు.
భూంపల్లి, మోతే, కాటేవాడి జలాశయాల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం పద్మాజివాడి, తుక్కోజివాడి, మర్కల్, రామారెడ్డి గ్రామాల్లో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంగారెడ్డి, గ్రామాధ్యక్షుడు గంగారాం, జిల్లా సేవాదళ్అధ్యక్షుడు లింగాగౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాగయ్య, ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సంపత్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ సంగ్యా నాయక్, సింగిల్విండో చైర్మన్ గంగాధర్, మాజీ వైస్ ఎంపీపీలు శ్రీనివాస్ రెడ్డి, రూపేందర్ రెడ్డి దితరులు పాల్గొన్నారు.