త్వరలోనే కానాయపల్లిని తరలిస్తాం : ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి

త్వరలోనే కానాయపల్లిని తరలిస్తాం : ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి

వనపర్తి, వెలుగు: కానాయపల్లి ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించి, త్వరలోనే గ్రామాన్ని తరలిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి అన్నారు. శంకర సముద్రం కుడి కాలువ నుంచి 12 గ్రామాల్లో 8 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు. కానాయపల్లి పునరావాస కేంద్రంలో రూ.43.5 లక్షలతో  నిర్మించిన మండల పరిషత్ ప్రైమరీ స్కూల్​ను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మంగళవారం ప్రారంభించారు.

 వడ్డెర, యాదవ, హమాలీ కమిటీల హాళ్లకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే  నిర్వాసితులకు ప్లాట్లు, పరిహారం ఇప్పిస్తానని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రైమరీ స్కూల్లో ఏఐ ద్వారా విద్యాబోధనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఈవో అబ్దుల్ ఘని, మదనాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్  ప్రశాంత్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, హెచ్ఎం విజయ్ కుమార్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కృష్ణారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఉన్నారు. 

 బీఆర్ఎస్ పనికొచ్చే పనులు చేయలేదు

కొత్తకోట, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ ప్రజలకు పనికొచ్చే పనులు చేయలేదని ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి ఆరోపించారు. మంగళవారం కొత్తకోటలోని ఓ  ఫంక్షన్ హాల్లో  కొత్త రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.  కలెక్టర్ ఆదర్శ సురభి, ఏడీసీ వెంకటేశ్వర్లు, డీఎస్​వో కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సైదయ్య పాల్గొన్నారు.