వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

చిన్నచింతకుంట,  వెలుగు: వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అన్నారు. గురువారం దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్స్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో జిల్లా కలెక్టర్‌‌తో కలిసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే 2487 మహిళా సంఘాలకు రూ. 2.78 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను 255 మహిళా సంఘాలకు రూ. 25.20 కోట్ల రుణాల చెక్కుల్ని అందజేశారు. కార్యక్రమంలో దేవరకద్ర మార్కెట్ యార్డ్ చైర్మన్ కథలప్ప, నాయకులు అరవింద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి కోన రాజశేఖర్, కిషన్ రావు, అధికారులు తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో శ్రీనివాస్ తో పాటు తదితరు పాల్గొన్నారు.