అందరి సమన్వయంతో అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

అందరి సమన్వయంతో అభివృద్ధి చేస్తాం :  ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
  •     ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: పార్టీలకు అతీతంగా అందరి సమన్వయంతో కాలనీలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. రామచంద్రాపురం జీహెచ్​ఎంసీ డివిజన్​ పరిధిలోని కాలనీ వాసులు గురువారం ఎమ్మెల్యేను కలిశారు. ఇటీవల కాలనీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెన్నవరం మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించి పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. కాలనీల వెల్ఫేర్​ సంఘాలు, అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో ఉండాలని, స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్​ సభ్యులు, సీనియర్​ నాయకులు, కాలనీ యువకులు పాల్గొన్నారు.