తెల్లాపూర్, అమీన్ పూర్ పరిధిలో మరో రెండు కొత్త డివిజన్లు ఏర్పాటు చేయండి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

 తెల్లాపూర్, అమీన్ పూర్ పరిధిలో మరో రెండు కొత్త డివిజన్లు ఏర్పాటు చేయండి :  ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
  • జీహెచ్ఎంసీ కమిషనర్​ను కోరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి 

అమీన్​పూర్​(పటాన్ చెరు), వెలుగు: తెల్లాపూర్, అమీన్ పూర్ పరిధిలో మరో రెండు కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలని, పటాన్ చెరు, రామచంద్రాపురం కేంద్రాలుగానే సర్కిల్ కార్యకలాపాలు కొనసాగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్​వీ కర్ణన్​ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.  గురువారం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ దశాబ్దాల చరిత్రతో పాటు నియోజకవర్గ కేంద్రంగా కలిగిన పటాన్​చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్​ఎంసీ పటాన్​చెరు సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్​కు తరలించారన్నారు. అమీన్​పూర్​ కేంద్రంగా నూతనంగా ఏర్పాటు చేసిన సర్కిల్ కార్యాలయాన్ని రామచంద్రాపురం కేంద్రంగా కొనసాగించాలని కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. పై రెండు అంశాల పైన కమిషనర్ సానుకూలంగా స్పందించారని  త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని తెలిపారు.