కల్లూరు మండలంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పర్యటన

కల్లూరు మండలంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పర్యటన

కల్లూరు, వెలుగు : కల్లూరు మండలంలోని చండ్రు పట్ల, లింగాల గ్రామాలలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదివారం పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. పలు శుభకార్యాలకు హాజరయ్యారు. చండ్రు పట్ల గ్రామానికి చెందిన లింగన్న బోయిన  నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను పరామర్శించారు. 

ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పసుమర్తి చందర్రావు, భాగం ప్రభాకర్ చౌదరి, ఎంపీటీసీ సభ్యురాలు నాగమ్మ, మాజీ ఎంపీటీసీ అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఏనుగు సత్యం బాబు, లింగన్న బోయిన పుల్లారావు, పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.