తెలంగాణలో ఎక్కడైనా ఒక్క ఎకరం పంట ఎండిపోయిందా? : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

తెలంగాణలో ఎక్కడైనా ఒక్క ఎకరం పంట ఎండిపోయిందా? :  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • కేటీఆర్​కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ఎకరం పంట ఎండిపోయిందా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రశ్నించారు. సాక్ష్యాధారాలు ఉంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. మంగళవారం సీఎల్పీలో మీడియాతో మేడిపల్లి సత్యం మాట్లాడారు. వ్యవసాయ సీజన్ పూర్తిగా ప్రారంభం కాకముందే కేటీఆర్ ఈ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు.

 రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని, ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు కాలిపోయి పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ పిచ్చి వాగుడు వాగుతున్నారని ఆరోపించారు. రైతులు సంతోషంగా ఉంటే కేటీఆర్ ఓర్వలేక పోతున్నారని, వర్షాలు కురువొద్దని, ప్రాజెక్టులకు నీరు రాకుండా రైతుల పొలాలు ఎండిపోవాలని కేటీఆర్ కోరుకుంటున్నారని అన్నారు. స్పైడర్ సినిమాలోని విలన్ లా కేటీఆర్ తీరు ఉందని మండిపడ్డారు.