ఇందిరా మహిళా శక్తి చీరలు సిరిసిల్లకు గర్వకారణం

ఇందిరా మహిళా శక్తి చీరలు సిరిసిల్లకు గర్వకారణం

బోయినిపల్లి, వెలుగు: సిరిసిల్లలో తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రమంతా పంపిణీ చేయడం మనకు గర్వకారణమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శనివారం బోయినిపల్లి మండల కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఇన్​చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి పంపిణీ చేశారు.

 అనంతరం బోయినపల్లి మార్కెట్ యార్డులో రూ.55 లక్షలతో కవర్ షెడ్లు, ఎద్దు, ఎడ్ల బండి విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లేశ్​యాదవ్, వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సురేందర్ రెడ్డి, దుర్గారెడ్డి, డీఆర్డీవో శేషాద్రి, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీవో జయశీల, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి పాల్గొన్నారు. 

ఆడపడుచులకు సర్కారు సారె

గంగాధర: రాష్ట్రంలోని ఆడపడుచులకు ఇందిరా మహిళా శక్తి చీరల రూపంలో సర్కారు సారె ఇస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో శనివారం చీరలు పంపిణీ చేశారు. 65 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు అందజేశారు. ఏఎంసీఈఋ చైర్​పర్సన్ జాగిరపు రజిత- శ్రీనివాస్​రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,  నాయకులు పాల్గొన్నారు.

 మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక

రాజన్నసిరిసిల్ల: ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఇన్​చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్​లో కాంగ్రెస్​ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్​చార్జి కేకే మహేందర్ రెడ్డితో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చీరల ఉత్పత్తితో సిరిసిల్లలోని 130 మ్యాక్స్ సొసైటీలు, 6 వేల మంది కార్మికులకు ఉపాధి లభించిందని పేర్కొన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్లు స్వరూపారెడ్డి, విజయ, సాబేరా బేగం ఉన్నారు.

సిరిసిల్ల కార్మికులకు ఉపాధి 

చీరల ఉత్పత్తితో సిరిసిల్ల కార్మికులకు ఉపాధి లభించిందని మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఇన్​చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. ఇల్లంతకుంట రైతు వేదికలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్య, వైస్ చైర్మన్ ప్రసాద్, డీఆర్డీవో శేషాద్రి, డీసీవో రామకృష్ణ, తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీవో శశికళ పాల్గొన్నారు.

 మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి 

శంకరపట్నం: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. శంకరపట్నంలో చీరలు పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. జడ్పీ సీఈవో పవన్ , ఎంపీడీవో కృష్ణప్రసాద్, తహసీల్దార్ సురేఖ, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు బసవయ్య తదితరులు పాల్గొన్నారు.