గంగాధర, వెలుగు: ఆడపిల్లలను వేధించేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని ఓ స్కూల్‌లో విద్యార్థులను వేధించిన ఘటనలో శుక్రవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. స్కూల్‌లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దన్నలా అండగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు.
విద్యార్థులను వేధించిన ఘటనలో హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కలెక్టర్‌తో మాట్లాడి నిమిషాల్లోనే నిందితుడిని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన హెచ్ఎంను సస్పెండ్ చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో శ్రీరాంమొండయ్య, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో రాము, ఎంఈవో ప్రభాకర్‌రావు, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్‌రావు, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చయ్య, లీడర్లు పాల్గొన్నారు.
చొప్పదండి హైస్కూల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చొప్పదండి, వెలుగు: చొప్పదండి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సత్యం శంకుస్థాపన చేశారు. కాంపౌండ్ నిర్మాణానికి రూ.15 లక్షలు, వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరయ్యాయి. అనంతరం స్కూల్ యాజమాన్యం, వాకర్స్ టీం సభ్యులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్మాజీ చైర్‌పర్సన్ గుర్రం నీరజ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగయ్యగౌడ్, లీడర్లు తిరుపతి గౌడ్, చందు తదితరులు పాల్గొన్నారు.
