
పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ నియోజకవర్గంలో పేద ప్రజల వైద్య అవసరాల కోసం నాలుగు కొత్త అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు (యూపీహెచ్సీలు) మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీగణేశ్ శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్తో కలిసి కొత్త యూపీహెచ్సీలు, అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటు కోసం అనువైన ప్రాంతాల గురించి చర్చించారు.
బోర్డు పరిధిలోని వివిధ సమస్యలపై కూడా ఎమ్మెల్యే సీఈవోతో మాట్లాడారు. అనంతరం పికెట్లోని తన క్యాంపు ఆఫీస్లో 62 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.