సీఎం కేసీఆర్ పై లీడర్ల ప్రశంసల వర్షం

సీఎం కేసీఆర్ పై లీడర్ల ప్రశంసల వర్షం

జనగామ జిల్లా: సీఎం కేసీఆర్ పై టీఆర్ఎస్ లీడర్లు ప్రశంసల వర్షం కురిపించారు. జనగామ సభలో మాట్లాడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. సీఎం కేసీఆర్ మా దేవుడు, ప్రత్యక్షదైవం, దేశ్ కీ నేత అంటూ పొగడ్తలతోె ముంచెత్తారు. 

కేసీఆర్ కృషితో పుట్లకు పుట్లు ఒడ్లు పండుతున్నయ్

సీఎం కేసీఆర్ కృషితో జనగామ జిల్లాలోని ప్రతి పల్లెలో పుట్లకు పుట్లు ఒడ్లు పండుతున్నాయని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. శుక్రవారం జనగామ బహిరంగ సభలో మాట్లాడిన పల్లా..జనగామ జిల్లా ఇచ్చి అద్భుతంగా కలెక్టరేట్ కొత్త భవనం కడుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ కు స్వాగతం తెలియజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ దేవుడు సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ ప్రాంతం అంటే సీఎంకి చాలా అనుబంధం ఉందన్నారు. ఎంతో మందితో సంబంధాలున్నాయని.. ఈ ప్రాంతం బాధలపై అనేకసార్లు చెప్పుకుని బాధపడ్డారన్నారు. చెన్నూరు, చేర్యాల, స్టేషన్ ఘన్ పూర్ లోనూ టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ప్రతి గ్రామంలో మంచినీరు, చెరువులు నిండటంతో పుట్లకు పుట్లు ఒడ్లు పండుతున్నాయన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. మొదటి నుంచి జయశంకర్ సార్ మీ వెంట ఉండటంతో ఈ ప్రాంతం గురించి కేసీఆర్ కు తెలుసన్నారు.

ప్రత్యక్ష దైవం మా ముఖ్యమంత్రి కేసీఆర్ 

ప్రత్యక్ష దైవం సీఎం కేసీఆర్ ముందు నిలబడి ఏం కావాలంటే మాటలు రావడంలేదన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ముఖ్యమంత్రిని దీవించడానికి ఇంతమంది వచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు. ఒకప్పుడు జనగామ ప్రాంతంలో బియ్యం కడిగి వడపోసిన నీటిని వాడుకున్న పరిస్థితి అన్నారు. అలాంటిది ఇప్పుడు ఇంటికే మంచి నీరు వస్తుందన్నారు. ఈ రోజు నా పుట్టినరోజు అని ఇదే రోజు కలెక్టరేట్ ప్రారంభం కావడం నా జన్మధన్యం అన్నారు. పార్టీ ఆఫీసు కూడా ఓపెన్ కావడంతో ఈ పండుగ రోజును జీవితంలో మరిచిపోను అని సంతోషం వ్యక్తం చేశారు. దేవాదుల కాలువాను ఆనాటి ప్రభుత్వాలు సన్నగా చేశాయని.. ఇప్పుడు ఆ కాలువలను రూపకర్త చేసిన మా ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో మాకు మాటలు రావడంలేదన్నారు. రాబోయే తరతరాలకు కరువు లేకుండా చేసిన సీఎంని ఏమని అడగమంటారన్నారు. ఎవరు అడిగితే కల్యాణలక్ష్మి, రైతుబంధు, దళిత బంధు, చేప పిల్లలు, గొర్రెలు ఇచ్చారని చెప్పారు. ఇలాంటి గొప్ప వ్యక్తిపై ప్రతిపక్షాలు దురుసుగా మాట్లాడితే ఖబడ్దార్ మర్యాద దక్కదన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మా ముఖ్యమంత్రిని నేడు భారతదేశం ఆహ్వానం పలుకుతుందని చెప్పుకొచ్చారు  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.

దేశ్ కీ నేత సీఎం కేసీఆర్

రాజయ్య నీ స్థాయి తగ్గకుండా నిన్ను, నీ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తా అని సీఎం కేసీఆర్ గారు నాకు మాట ఇచ్చారన్నారు తాటికొండ రాజయ్య. శుక్రవారం జనగామ బహిరంగ సభలో మాట్లాడిన రాజయ్య.. బీజేపీ రాబంధువులు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని..  దళితబంధు, మహిళాబంధు కేసీఆర్ అన్నారు. బహుజనుల బంధువు.. అంబేద్కర్ ఆలోచనలు.. ఆయన ఆశయాలతో దళితబంధు తీసుకొచ్చిన దేవుడు కేసీఆర్ అన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో దళితబంధు దేశవ్యాప్తాంగా అమలుకావాలన్నారు. దేశ్ కీ నేత సీఎం కేసీఆర్ అని.. మన రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం కావడంతో కేసీఆర్ ను దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. స్టేషన్ ఘన్ పూర్ కు ఢిగ్రీ కాలేజీ ఇచ్చిన దేవుడు కేసీఆర్ అన్నారు. అయితే వేదికకు స్వాగతం పల్లా రాజేశ్వర్ రెడ్డి..  రాజయ్యను 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలన్నారు. దీంతో ఎన్నో విషయాలు చెప్పే రాజయ్య పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందే సమయాన్ని కేటాయించడంతో రాజయ్య స్పీచ్ తొందరగా ముగించాడు.