ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కాళ్లు మొక్కిన మహిళా రైతు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కాళ్లు మొక్కిన మహిళా రైతు

జనగామ జిల్లాలో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. చేతికొచ్చే సమయానికి వడగళ్ల వాన పడటంతో  పంటలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగా అడవి కేశపూర్ గ్రామంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పర్యటించారు.  ఈ సందర్బంగా కొందరు రైతులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని ఆదుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే ఓ మహిళా రైతు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కాళ్ల మీద పడ్డారు. తమను ఆదుకోవాలని బోరున ఏడ్చారు. మహిళా రైతును ఓదార్చిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి..ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 
 
జనగామ జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నర్మెట్ట, బచ్చన్నపేట, తరిగొప్పుల మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. లింగాలఘణపురం మండలం నావాబుపేట, కుందారం, అడవి కేశవాపూర్  గ్రామాల్లో కుండపోత వర్షం కురిసింది. చెట్టుపై పిడుగు పడడంతో ప్రమాదం తప్పింది. నర్మెట్ట, తరిగొప్పుల మండలాల్లో రాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో భారీగా మామిడి, వరి, మిర్చి  పంటలు నష్టపోయాయి.